
‘ధూంధాం’గా కళ వెలగాలి
తెలంగాణ కళారూపాలను ముందుతరాలకు అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో కృషి చేయాలని ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కళారూపాలను ముందుతరాలకు అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో కృషి చేయాలని ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు. ఉద్యమానికి ఊపిరి అయిన కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు, గౌరవం ఉండాలని కోరుతున్నారు. వారికి ఆర్థికంగా చేయూత అందించాలని అంటున్నారు. అన్ని జిల్లాల్లో జానపద కళా కేంద్రాలనే ఏర్పాటు చేయాలని, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని అంటున్నారు.
తెలంగాణ అంటేనే సాంస్కృతిక సమ్మేళనం. 10 జిల్లాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా కళారం గంలో ప్రత్యేకతలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర కళాకారులనే గుర్తించారు. తెలం గాణ కళాకారులను నిర్లక్ష్యం చేశారు. ఒకరకంగా తెలంగాణలో సాంస్కృతిక దాడి జరిగింది. భాషపై నా... కళలపైనా ఈ దాడి కేంద్రీకృతమైంది. పాటలు, రచనలు, సిని మాల ద్వారా ఈ దాడి పరాకాష్టకు చేరింది. దీంతో తెలంగాణ కళలన్నీ నిరాదరణకు గురయ్యాయి. సకల కళాకారులందరూ చెల్లా చెదుర య్యారు. బఠానీలు అమ్ము కోవడం... బడ్డీ కొట్టు పెట్టుకోవడం... రిక్షా తొక్కుకోవడం తదితర పనులు చేసుకుంటూ ఆ కళాకారులు బతుకులీ డుస్తున్నారు. వారి స్థానంలో సీమాంధ్ర కళలు రాజ్యమేలాయి. జననాట్యమండలి, అరుణోదయ కళలు కేవలం విప్లవ కేంద్రాలుగా మాత్రమే నిలిచాయి. ఈ సాంస్కృతిక దాడిని ధూంధాం ఎదుర్కొం ది. తెలంగాణ కళలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకు రాగలింది. ప్రజల లక్ష్యాలను ముందుకు తీసుకొచ్చింది. ధూంధాంతో పాటు అనేక తెలంగాణ కళావేదికలు ప్రజల పక్షాన నిలిచాయి. తెలంగాణ ప్రజలు తమ ఆట, పాటల ద్వారా కష్టసుఖాలను తెలియజేశారు. దూంధాం అన్ని ప్రజా సంఘాలను, పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఎర్రజెండానూ, కాషాయ జెండానూ ఒకే వేదిక మీదకు తీసుకురాగలింది.
తెలంగాణ కళలపై పరిశోధనలు జరగాలి...
తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. అందుకోసం పోరాడాలి. కాకతీయుల కాలం నాటి నుంచి కళాకారుల కుటుంబాలు కళలపై ప్రత్యేక శ్రద్ధ వహించాయి. వీటి పునరుజ్జీ వనం జరగాలి. అన్ని జిల్లాల్లో జానపద కళా కేంద్రా లను ఏర్పాటు చేయాలి. వాటి మీద పరిశోధనలు జరగాలి. కళాకారుల కుటుం బాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. స్పోర్ట్స్ కోటా మాదిరి సాంస్కృతిక కోటా ఏర్పరచాలి. కళాకారు లను గుర్తించాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనివ్వాలి.
సినిమా కళాకారులకు ఇళ్లు ఇచ్చారు. అలాగే తెలంగాణ కళాకారులకు కూడా ఇవ్వాలి. వారికీ రాజకీయ కోటా ఇవ్వాలి. తెలంగాణ కళారూపాలను ముందు తరాలకు అందించాలంటే వాటిని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. అందుకోసం కళాకారులను టీచర్లుగా నియమించాలి. ప్రభుత్వ పథకాలను కళాకారుల ద్వారానే ప్రచారం చేయించాలి. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డులను ఏర్పాటు చేయాలి. బడ్జెట్లో కళారంగానికి ప్రత్యేక నిధికేటాయించాలి. తెలంగాణ కథల మీద సినిమాలు రావాలి. అందులో ఇక్కడి కళాకారులే ఉండాలి. ఆయా ప్రాంతాల సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేలా వీటిని నిర్మించాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను సాకారం చేసేందుకు కళాకారులు అవసరమైతే మళ్లీ ఉద్యమిస్తారు. అంతేగాక కళారంగాన్ని రక్షించుకు నేందుకు తెలంగాణ కళాకారుల పరిరక్షణ వేదిక ఏర్పాటు జరుగుతుంది.