మైండ్‌గేమ్ ఆడుతున్న కేసీఆర్: పొన్నాల | kcr plays mind game, says ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

మైండ్‌గేమ్ ఆడుతున్న కేసీఆర్: పొన్నాల

May 5 2014 1:54 PM | Updated on Sep 6 2018 2:48 PM

మైండ్‌గేమ్ ఆడుతున్న కేసీఆర్: పొన్నాల - Sakshi

మైండ్‌గేమ్ ఆడుతున్న కేసీఆర్: పొన్నాల

కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని అధికారం తమదేనంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణలో తొలి సర్కార్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇక విశ్రాంతే శరణ్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం టీఆర్ఎస్‌దే అంటూపార్టీ శ్రేణులను, ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని అధికారం తమదేనంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని అన్నారు.

గాంధీభవన్‌లో జిల్లాల వారీగా పొన్నాల పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో ఆయన చర్చలు జరిపారు. కాగా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు సీనియర్ నేతలంతా మట్టికరవడం ఖాయమని సిద్దిపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement