దశా దిశాలేని పార్టీ టీఆర్‌ఎస్: దామోదర | decade, the trs majority of the party: damodara | Sakshi
Sakshi News home page

దశా దిశాలేని పార్టీ టీఆర్‌ఎస్: దామోదర

Apr 20 2014 2:32 AM | Updated on Sep 27 2018 8:33 PM

దశా దిశాలేని పార్టీ టీఆర్‌ఎస్: దామోదర - Sakshi

దశా దిశాలేని పార్టీ టీఆర్‌ఎస్: దామోదర

దశాదిశాలేని పార్టీ టీఆర్‌ఎస్ అని, ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని మాజీ ఉపముఖ్యమంత్రి, అందోల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సి. దామోదర రాజనర్సింహ విమర్శించారు.

టేక్మాల్,  దశాదిశాలేని పార్టీ టీఆర్‌ఎస్ అని, ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని మాజీ ఉపముఖ్యమంత్రి, అందోల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సి. దామోదర రాజనర్సింహ విమర్శించారు. శనివారం ఆయన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో కుటుంబ పార్టీగా చెలామణి అవుతుందని ఆరోపించారు. తెలంగాణ వస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని, దళితుడిని సీఎంగా, మైనార్టీని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చాడని విమర్శించారు. దగా, మోసం చేసే కేసీఆర్‌ను ఎవరూ నమ్మరాదని సూచించారు. నవ తెలంగాణ, సామాజిక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement