పుండు మీద కారం | congress party candidates cell messages | Sakshi
Sakshi News home page

పుండు మీద కారం

Apr 24 2014 12:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

పుండు మీద కారం - Sakshi

పుండు మీద కారం

పుండు మీద కారంలా తయారయ్యాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వెలువడుతున్న సెల్ మెసేజ్‌లు.

మండపేట, న్యూస్‌లైన్ : పుండు మీద కారంలా తయారయ్యాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వెలువడుతున్న సెల్ మెసేజ్‌లు. మొన్నటి వరకు చంద్రబాబు ఫోన్‌లతో అయోమయానికి గురైన ఓటర్లు నేడు తాజాగా కాంగ్రెస్ వారు ఇస్తున్న మెసేజ్‌లు చూసి మండిపడుతున్నారు.  
 
 కాంగ్రెస్ పార్టీ తరఫున ఫలానా అభ్యర్థికి ఓటు వేయండంటూ తెలంగాణ  ప్రాంతానికి చెందిన అభ్యర్థి పేరుతో పాటు చివర్లో జై తెలంగాణ.. జై కాంగ్రెస్ పార్టీ అంటూ మెసేజ్‌లు వస్తుండటం చూసి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఆగ్రహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
 అసలే విభజన కారణంగా తమకు సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తాజాగా వస్తున్న మెసేజ్‌ల కారణంగా డిపాజిట్‌లు కూడా దక్కవన్న ఆందోళనలో కాంగ్రెస్ అభ్యర్థులు భయపడుతున్నారు. పుండు మీద కారంలా ఈ మెసేజ్‌ల గొడవేంటిరాబాబూ ఇవి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వస్తున్నాయా..? లేక ఎవరైనా కావాలని పంపిస్తున్నారా అన్న అనుమానాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement