కేజ్రీవాల్‌కు దెబ్బలు.. పార్టీకి డబ్బులు! | Arvind Kejriwal to contest against narendra Modi from Varanasi | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు దెబ్బలు.. పార్టీకి డబ్బులు!

Apr 18 2014 5:27 AM | Updated on Sep 17 2018 5:10 PM

కేజ్రీవాల్‌కు దెబ్బలు.. పార్టీకి డబ్బులు! - Sakshi

కేజ్రీవాల్‌కు దెబ్బలు.. పార్టీకి డబ్బులు!

చెంపదెబ్బలు.. ఇంకు చల్లడాలు.. టమాటాలు, కోడిగుడ్లు విసరడాలు.. ఇవన్నీ రాజకీయ నాయకులను భయపెట్టేవే! ఇబ్బంది సృష్టించేవే! కానీ, ఆమ్‌ఆద్మీ పార్టీకి మాత్రం అవి బాగా కలిసొస్తున్నాయి..

న్యూఢిల్లీ: చెంపదెబ్బలు.. ఇంకు చల్లడాలు.. టమాటాలు, కోడిగుడ్లు విసరడాలు.. ఇవన్నీ రాజకీయ నాయకులను భయపెట్టేవే! ఇబ్బంది సృష్టించేవే! కానీ, ఆమ్‌ఆద్మీ పార్టీకి మాత్రం అవి బాగా కలిసొస్తున్నాయి.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడులు జరిగినప్పుడల్లా కోట్ల కొద్దీ విరాళాలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా జరిగిన ఘటనలను గమనిస్తే.. ఇదే ప్రస్ఫుటమవుతోంది. ఈ నెల 4న దక్షిణ ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.
 
 
 ఆ రోజు ఆప్‌కు ఏకంగా రూ.1.35 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకు ముందు రోజు వచ్చిం ది రూ.30 లక్షలే! ఆటో డ్రైవర్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టిన ఈ నెల 8న రూ. 85 లక్షలు.. గత నెల 25న వారణాసిలో కేజ్రీవాల్‌పై దాడి జరిగిన రోజున రూ.49 లక్షల విరాళాలు సమకూరాయి. ఇవన్నీ కూడా అంతకుముందు రోజుల్లో అతి తక్కువ విరాళాలు వచ్చి.. ఒక్కసారిగా పెరిగిపోయినవే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement