కామన్వెల్త్ , ఆసియా క్రీడలు

కామన్వెల్త్ ,  ఆసియా క్రీడలు


కామన్వెల్త్ క్రీడలు

 కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930-50 కాలంలో బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954-66 మధ్య బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970-74 కాలంలో బ్రిటీష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగు సార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.

 

 20వ కామన్వెల్త్ క్రీడలు:

 20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది.

 

 భారత స్వర్ణపతక విజేతలు:

 

 సంజిత కుముక్‌చామ్    మహిళల వెయిట్ లిఫ్టింగ్

 సుఖేన్ డే    పురుషుల వెయిట్ లిఫ్టింగ్

 అభినవ్ బింద్ర    షూటింగ్

 అపూర్వి చందేల    మహిళల షూటింగ్

 రాహి సర్నోబత్    మహిళల షూటింగ్

 సతీష్ శివలింగం    వెయిట్ లిఫ్టింగ్

 జీతురాయ్    షూటింగ్

 అమిత్ కుమార్    రెజ్లింగ్

 వినేష్ ఫోగత్    మహిళల రెజ్లింగ్

 సుశీ కుమార్    రెజ్లింగ్

 బబిత కుమారి    మహిళల రెజ్లింగ్

 యోగేశ్వర్ దత్    రెజ్లింగ్

 వికాస్ గౌడ    డిస్కస్ త్రో

 దీపికా పల్లికల్    

 జ్యోత్స్న చిన్నప్ప    స్క్వాష్ (మహిళల డబుల్స్)

 పారుపల్లి కశ్వప్    బ్యాడ్మింటన్

 

 కామన్వెల్త్ క్రీడలు- వేదికలు

 

 ఇప్పటి వరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.

 కొన్నింటి వివరాలు.

 సంవత్సరం    నగరం    దేశం

 1930    హామిల్టన్    కెనడా

 1934    లండన్    ఇంగ్లండ్

 1938    సిడ్నీ    ఆస్ట్రేలియా

 1950    అక్లాండ్    న్యూజిలాండ్

 1954    వాంకోవర్    కెనడా

 1998    కౌలాలంపూర్    మలేసియా

 2002    మాంచెస్టర్    ఇంగ్లండ్

 2006    మెల్‌బోర్న్    ఆస్ట్రేలియా

 2010    న్యూఢిల్లీ    ఇండియా

 2014     గ్లాస్గో    స్కాట్లాండ్

 

 ఆసియా క్రీడలు

 ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.

 

 17వ ఆసియా క్రీడలు:

 17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9, 501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా, దేశాలు వరుసగా తర్వాతి ఏడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు.

 

 భారత స్వర్ణ పతక విజేతలు:

     జీతురాయ్ (షూటింగ్)

     యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)

     సానియా మీర్జా     (టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్)

     సాకేత్ మైనేని

     సీమా పూనియా (మహిళల డిస్కస్ త్రో)

     మేరీ కోమ్ (మహిళల బాక్సింగ్)

     4 గీ 400 మీటర్ల రిలే (భారత మహిళల జట్టు)

     భారత హకీ జట్టు

     పురుషుల కబడ్డీ జట్టు

     మహిళల కబడ్డీ జట్టు

     స్వ్కాష్ పురుషుల జట్టు

     పురుషుల కాంపౌండ్ జట్టు (ఆర్చరీ)

 

 ఆసియా క్రీడలు- వేదికలు

 ఇప్పటి వరకు 17 ఆసియా క్రీడలు జరిగాయి.

 కొన్ని వేదికల వివరాలు.

 

 సంవత్సరం    నగరం    దేశం

 1982     న్యూఢిల్లీ    ఇండియా

 1986    సియోల్    దక్షిణ కొరియా

 1990    బీజింగ్    చైనా

 1994    హిరోషిమా    జపాన్

 1998    బ్యాంకాక్    థాయిలాండ్

 2002    బుసాన్    దక్షిణ కొరియా

 2006    దోహా    ఖతార్

 2010    గ్వాంగ్ జు    చైనా

 2014     ఇంచియాన్    ద క్షిణ కొరియా

 

 కోపా అమెరికా

 కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో దక్షిణ అమెరికా ఖండ దేశాలు పాల్గొంటాయి. ఇది తొలిసారి 1916లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉరుగ్వే అత్యధికంగా 15 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. 44వ కోపా అమెరికా టోర్నీ 2015, జూన్ 11 నుంచి జూలై 4 వరకు చిలీలో జరిగింది. ఈ టోర్నీలో మొత్తం 12 దేశాలు పాల్గొన్నాయి. శాంటియాగోలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం చిలీ అర్జెంటీనాను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి తొలిసారి కోపా అమెరికా కప్‌ను సాధించింది. వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్‌కు వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సెంటెన్నియల్ కోపా అమెరికా టోర్నీని 2016, జూన్‌లో యూఎస్‌ఏలో నిర్వహించనున్నారు. తొలిసారి కోపా అమెరికా కప్‌ను దక్షిణ అమెరికా ఖండం వెలుపల నిర్వహించనున్నారు.

 

 మాదిరి ప్రశ్నలు

 

 1.    2018లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా నగరం?

     1) సిడ్నీ        2) పెర్త్

     3) హాబార్ట్        4) గోల్డ్ కోస్ట్

 2.    22వ కామన్వెల్త్ క్రీడలు 2022లో ఎక్కడ జరగనున్నాయి?

     1) కౌలాలంపూర్, మలేసియా

     2) ఎడ్మంటన్, కెనడా

     3) డర్బన్, దక్షిణాఫ్రికా

     4) వెల్లింగ్‌టన్, న్యూజిలాండ్

 3.    దీపా కర్మాకర్ భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకాన్ని ఏ క్రీడలో సాధించింది?

     1) జిమ్నాస్టిక్స్    2) స్క్వాష్

     3) జావెలిన్ త్రో

     4) డిస్కస్ త్రో

 4.    భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంవత్సరం?

     1) 2010        2) 1986

     3) 1982        4) 1998

 5.    భారత హాకీ జట్టు 2014 ఆసియా క్రీడల ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించి స్వర్ణపతకాన్ని దక్కించుకుంది?

     1) దక్షిణ కొరియా

     2) జపాన్

     3) ఇరాన్        4) పాకిస్థాన్

 6.    ఆసియా క్రీడలు 2018లో ఏ నగరంలో జరగనున్నాయి?

     1) మనీలా        2) టోక్యో

     3) జకర్తా        4) న్యూఢిల్లీ

 7.    19వ ఆసియా క్రీడలు 2022 సెప్టెంబరులో చైనాలోని ఏ నగరంలో జరుగుతాయి?

     1) బీజింగ్        2) షాంఘై

     3) గ్వాంగ్ జు    4) హాంగ్ జు

 8.    కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను 2019లో ఏ దేశంలో నిర్వహిస్తారు?

     1) బ్రెజిల్        2) అర్జెంటీనా

     3) పెరూ        4) బొలీవియా

 9.    దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు ఆసియా క్రీడలు నిర్వహించని నగరం?

     1) సియోల్        2) బుసాన్

     3) ఇంచియాన్    4) నామ్‌వన్

 10.    2016లో వందేళ్లు పూర్తి చేసుకోనున్న టోర్నమెంట్?

     1) ప్రపంచకప్ ఫుట్‌బాల్

     2) కోపా అమెరికా    3) ఆసియా క్రీడలు

     4) కామన్వెల్త్ క్రీడలు

 

 సమాధానాలు

     1) 4    2) 3    3) 1    4) 3

     5) 4    6) 3    7) 4    8) 1

     9) 4    10) 2

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top