ప్రతిష్టాత్మక ‘లా’కు క్లాట్ | Common Law Admission Test | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక ‘లా’కు క్లాట్

Apr 8 2015 11:09 PM | Updated on Sep 3 2017 12:02 AM

కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2015ను లక్నోలోని డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించనుంది.

కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2015ను లక్నోలోని డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించనుంది.
  అర్హత:
 యూజీ కోర్సులకు: జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగు లు 45 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. 2015 మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేవారు అర్హులే.వయోపరిమితి: జూలై 1, 2015 నాటికి జనరల్/ఓబీసీలకు 20 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 22 ఏళ్లు). పీజీ కోర్సులకు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
 
 యూజీ కోర్సులకు పరీక్ష విధానం:
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్ ఇన్‌క్లూడింగ్ కాంప్రెహెన్షన్    40
 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్    50
 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
 (న్యూమరికల్ ఎబిలిటీ)    20
 లీగల్ ఆప్టిట్యూడ్    50
 లాజికల్ రీజనింగ్    40
 ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
 
 పీజీ కోర్సులకు పరీక్ష విధానం:
 కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యురిస్‌ప్రుడెన్స్‌ల నుంచి 50 చొప్పు న ప్రశ్నలు ఇస్తారు. కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఐపీఆర్ తదితర సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. సరైన సమాధానానికి 1 మార్కు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
 
 ప్రిపరేషన్ టిప్స్:
  ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: అభ్యర్థి ఇంగ్లిష్ వ్యాకరణాన్ని, గ్రహణశక్తిని పరిశీలించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విభాగం ఇంగ్లిష్. ఇచ్చిన ప్యాసేజ్ ప్రధాన విషయాన్ని గుర్తించడంతోపాటు పదాలను అర్థాలను తెలుసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకోవడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. నిర్దేశిత సిలబస్ అంటూ లేని ఈ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సమాధానం గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఇందులో గణితంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి. పదో తరగతి స్థాయిలోనే ఈ ప్రశ్నలుంటాయి.లీగల్ ఆప్టిట్యూడ్: పరీక్షలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. ఇందులో ప్రధానంగా స్టడీ ఆఫ్ లా, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, సమస్య పరిష్కార సామర్థ్యంలో అభ్యర్థిని అంచనా వేసేలా ప్రశ్నలడుగుతారు.లాజికల్ రీజనింగ్: తార్కిక నమూనాలు, లాజికల్ లింక్స్ ను గుర్తించడంతోపాటు తర్కవిరుద్ధమైన వాదనలను సరిచేయడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.
 
 రిఫరెన్స్ బుక్స్
  ఇంగ్లిష్ గ్రామర్ - రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ-నార్మన్ లూయిస్.  ఏ మోడ్రన్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్ - ఆర్‌ఎస్ అగర్వాల్;  క్లాట్ ఎగ్జామ్ గైడ్-అరిహంత్ పబ్లికేషన్స్;  క్లాట్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు;  జనరల్ నాలెడ్జ్ కోసం మళయాల మనోరమ ఇయర్‌బుక్, కరెంట్ అఫైర్స్ కోసం ఏవైనా మ్యాగజైన్లు, దినపత్రికలు.
 
 ముఖ్య సమాచారం:
     ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2015
     ఆన్‌లైన్ పరీక్ష: మే 10, 2015.
     వెబ్‌సైట్: జ్ట్టిఞ://ఛ్చ్టి.్చఛి.జీ
 
 క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు
     నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు.
     నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్.
     నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్.
     వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్, కోల్‌కతా.
     నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్.
     హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్.
     గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్.
     డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో.
     రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పంజాబ్.
     చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా.
     నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్,కోచి
             నేషనల్ లా యూనివర్సిటీ, కటక్.
     నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ.
     నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ, గువహటి.
     దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం.
     తమిళనాడు నేషనల్ లా స్కూల్, తిరుచిరాపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement