విద్యుదఘాతంతో యువకుడి మృతి | young guy died with current shock | Sakshi
Sakshi News home page

విద్యుదఘాతంతో యువకుడి మృతి

Aug 24 2016 10:59 PM | Updated on Sep 28 2018 3:41 PM

విద్యుదఘాతంతో యువకుడి మృతి - Sakshi

విద్యుదఘాతంతో యువకుడి మృతి

మంచి నీరు తాగేందుకు వెళ్లి ఓ యువకుడి విద్యుదఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటుచేసుకుంది.

వెంకట్రాంపురం(కోదాడరూరల్‌)
 మంచి నీరు తాగేందుకు వెళ్లి ఓ యువకుడి విద్యుదఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలప ప్రకారం గ్రామానికి చెందిన రావెళ్ల వెంకటయ్య, సూరమ్మ దంపతలు చిన్న కుమారుడు గోపి(18) తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో వరి నారు పంచేందుకు  వెళ్లాడు. కూలీలు నాటువేస్తుండగా మంచి నీరు తాగేందుకు సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ బోరు వద్దకు వెళ్లాడు. నీరు తాగిన అనంతరం అక్కడే ఉన్న షెడ్‌ నీడకు వెళ్లికూర్చొని పక్కనే ఉన్న మోటార్‌ పైప్‌పై చేయి వేయగా దానికి  విద్యుత్‌సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement