భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా | wife sitting in front of police station for jusctis | Sakshi
Sakshi News home page

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

Aug 9 2016 1:01 AM | Updated on Aug 21 2018 9:20 PM

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని  పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా - Sakshi

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

వెంకటాచలం : తాను బతికి ఉండగానే భర్త మరో వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఓ వివాహిత ధర్నా బంధువులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేçÙన్‌ ఎదుట ధర్నా చేపట్టింది.

 
వెంకటాచలం : తాను బతికి ఉండగానే భర్త మరో వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఓ వివాహిత బంధువులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేన్‌ ఎదుట ధర్నా చేపట్టింది. వెంకటాచలం వడ్డిపాళెంకు చెందిన తురకా శీనయ్య కుమార్తె అభినయకు అదే గ్రామానికి చెందిన ఉప్పు అంకయ్యతో వివాహమైంది. ఏడాది గడవక ముందే అంకయ్య రెండు రోజుల క్రితం నెల్లూరు రూరల్‌ మండలం అప్పయ్యకండ్రిగకు చెందిన మరో మహిళను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. బంధువు ద్వారా ఈ విషయం తెలుసుకున్న తురకా శీనయ్య, అతని కుమార్తె అభినయ అంకయ్యను ప్రశ్నించగా దుర్భాషలాడటమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేçÙన్‌ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరారు. అంకయ్య చేసిన మోసంపై పోలీసుల ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement