ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. దీక్షా స్థలాన్ని పోలీసుల సమక్షంలోనే ఎంపిక చేసినా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఇంతవరకు కేంద్రానికి పంపలేదని రోజా అన్నారు. అందర్ని కలుపుకొని ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తామని చెప్పారు. నగరి మున్సిపల్ కమిషనర్ విషయంలో ధర్మమే గెలిచిందని రోజా పేర్కొన్నారు.