ఎమ్మెల్యే బొడిగె శోభకు వారంట్‌ | warant issue to MLA bodiga shoba | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బొడిగె శోభకు వారంట్‌

Aug 26 2016 8:19 PM | Updated on Jun 4 2019 6:34 PM

కమాన్‌చౌరస్తా : క్రిమినల్‌æకేసులో కోర్టు వాయిదాకు హాజరుకావాల్సి ఉండగా రాకపోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు మరో ఐదుగురు మహిళలకు కరీంనగర్‌ అదనపు జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మాధవి శుక్రవారం వారెంట్లు జారీచేశారు.

కమాన్‌చౌరస్తా :  క్రిమినల్‌æకేసులో కోర్టు వాయిదాకు హాజరుకావాల్సి ఉండగా రాకపోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు మరో ఐదుగురు మహిళలకు కరీంనగర్‌ అదనపు జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మాధవి శుక్రవారం వారెంట్లు జారీచేశారు. కరీంనగర్‌లోని శాలిని పంక్షన్‌హాల్‌పై 2013, జూలై, 3న బొడిగె శోభ, వరాల జ్యోతి, గుర్రం పద్మ, ఆరోజు సరిత, రావికంటి భాగ్యలక్ష్మి, ములుకుంట్ల భారతి, గంటల రేణుక, తాటి ప్రభావతి దాడి చేసి విధ్వంసం సృష్టించారని, 45 వేల నష్టం వాటిల్లిందని రేగులపాటి మధుసూదన్‌రావు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభావతి హైకోర్టు నుంచి స్టే పొందగా మిగతా ఏడుగురు కోర్టుకు హాజరవుతున్నారు. కేసు వాయిదాలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరుకాకపోవడంతో ఏడుగురికి నాన్‌బెయిలెబుల్‌ వారంట్లు జారీచేస్తూ విచారణ వచ్చే నెల 21కి వాయిదా వేశారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement