మలేరియా, ఫైలేరియాపై పోరు..

మలేరియా, ఫైలేరియాపై పోరు..


♦ సంప్రదాయ మందులకు కొత్త రూపు

♦ నోబెల్ విజేతల ఘనత

 

 సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి మాట... మలేరియా వచ్చిందంటే... ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. బోదకాలు సోకిందంటే శాశ్వత వైకల్యం. పల్లెల్లో, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు... మలేరియాకైతే వారం రోజుల రెస్ట్... ఆర్టిమిసినిన్ ట్యాబ్లెట్లు కొన్ని మింగితే సరి! బోదకాలు, రివర్ బ్లైండ్‌నెస్ వ్యాధికి కారణమవుతున్న ఏలికపాము బ్యాక్టీరియా వంటి పరాన్నజీవులను సమర్థంగా నిరోధించగలుగుతున్నాం. ఇదంతా ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డుకు ఎంపికైన  ముగ్గురు శాస్త్రవేత్తల ఘనతేనంటే అతిశయోక్తి కాదు.  విలియం కాంప్‌బెల్ (ఐర్లాండ్), సతోషి ఒమురా (జపాన్), తు యుయు  (చైనా)ల పరిశోధనల పుణ్యమా అని పరాన్నజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులపై పోరాడేందుకు మానవాళికి కొత్త అస్త్రాలు లభించాయి. చైనా సంప్రదాయ వైద్యవిధాన సంస్థలో పనిచేస్తున్న 84 ఏళ్ల తు యుయు 1972లో ఆవిష్కరించారు. రెండువేల ఏళ్ల కిందే దీన్ని వాడేవారన్న పురాతన గ్రంధాల ఆధారంగా యుయు తు తన పరిశోధనలను నిర్వహించారు. 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో భాగంగా తు యుయు నిర్వహించిన పరిశోధనల ఫలితంగా ఆర్టిమిసిన్ అనువా అనే మొక్క ఆకుల్లో మలేరియాకు విరుగుడు మందు ఉందన్న విషయం తెలిసిందే. రెండులీటర్ల చల్లనీటిలో ఈ మొక్క ఆకులు తగినన్ని ఉంచి ఆ తరువాత ఆకుల పసరు తాగితే మలేరియా లక్షణాలు దూరమవుతాయని క్రీస్తుపూర్వం 340లో రాసిన ఓ వైద్య గ్రంథంలో దీని ప్రస్తావన ఉందని గుర్తించిన తు.. అందుకు తగ్గట్టుగా ఆర్టిమిసినిన్‌ను మొక్క నుంచి వేరు చేసే ప్రక్రియను కూ డా రూపొందించారు. మలేరియాపై ఈ మందు అత్యంత సమర్థంగా పనిచేస్తుందని తరువాతి పరిశోధనల ద్వారా స్పష్టం కావడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా వాడటం మొదలైంది. 15 ఏళ్లలో 1.5 లక్షల ప్రాణాలు...

 2000 నుంచి 2015 మధ్యకాలంలో మలేరియా మరణాలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కనీ సం నాలుగోవంతు ఆర్టిమిసినిన్ ద్వారా సాధ్యమైందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంటే ఈ ఒక్క మందు పదిహేనేళ్లలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కాపాడిందన్నమాట. నేల నుంచి పుట్టుకొచ్చిన పరిష్కారం

 పరాన్నజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులకు చాలాకాలంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి సామర్థ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అటువంటి పరిస్థితుల్లో విలియం క్యాంప్‌బెల్, సతోషి ఒమురాలు బోదకాలు, రివర్‌బ్లైండ్‌నెస్‌లకు చెక్‌పెట్టగల బ్యాక్టీరియాను మట్టిలోంచి వెలికితీయడం విశేషం. కొన్ని వేల రకాల స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియాలను పరీక్షించి వాటిల్లోంచి 50 జాతులను వేరు చేసిన సతోషి ఒమురా  చివరకు ఒక జాతి బ్యాక్టీరియా ద్వారా అవెర్‌మెక్టిన్ అనే రసాయాన్ని ఉత్పత్తి చేయగలిగారు. ఇదే సమయంలో అమెరికాలో పనిచేస్తున్న విలియం క్యాంప్‌బెల్.. ఒమురా ద్వారా స్ట్రెప్టెమైసిస్ బ్యాక్టీరియాను తెప్పించుకుని పశువులపై ప్రయోగించారు. ఈ బ్యాక్టీరియా పశువుల్లోని పరాన్నజీవులను సమర్థంగా నాశనం చేసినట్లు గుర్తించారు. దీంతో అవెర్‌మెక్టిన్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది.

 

 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం అమలుకు రూ. 36.44 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత ్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల ఏర్పాటు కు కేంద్రప్రభుత్వం బడ్జెట్లో రూ. 122 కో ట్లు కేటాయించింది. వాటిలో మొదటి వి డత రూ. 53 కోట్లు, రెండో విడత కింద రూ. 36.44 కోట్లు కేటాయించింది.

 

 ‘‘చైనా సంప్రదాయ వైద్యం ఆధారంగా మలేరియాకు మెరుగైన మందును ఆవిష్కరించిన తు యుయు కు నోబెల్ అవార్డు దక్కడం ఎంతైనా సముచితం. ఈ పరిణామం భారతీయ ఆయుర్వేదానికి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ ఏడాది వైద్య శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలందరూ బహుళజాతి కంపెనీల నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యాధులకు సమర్థ చికిత్సను అందించినవారు. మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల కారణంగా అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నది పేద ప్రజలేనన్నది గుర్తుంచుకోవాలి’’

     - శ్రీవారి చంద్రశేఖర్, డెరైక్టర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top