ఆటోను ఎదురుగా వసున్న పాలవ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు
పాకాల(చిత్తూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం కొనప్పరెడ్డి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామం నుంచి వెళ్తున్న ఆటోను ఎదురుగా వసున్న పాలవ్యాన్ ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.