ప్రకతి సాగు.. పంటలు బాగు | Training for farmers on Nature cultivation | Sakshi
Sakshi News home page

ప్రకతి సాగు.. పంటలు బాగు

Sep 20 2016 12:04 AM | Updated on Sep 4 2017 2:08 PM

సేంద్రియ ఎరువులు, పాల ఉత్పత్తికి పశువుల పెంపకం

సేంద్రియ ఎరువులు, పాల ఉత్పత్తికి పశువుల పెంపకం

రైతులు అధికాదాయం పొందాలి. మంచి దిగుబడినిచ్చే పంటలు పండించాలి.. ఇదే లక్ష్యంతో ఎన్‌సీఎస్‌ కర్మాగారం రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో నేర్చుకున్న పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. కర్మాగారం ఎమ్‌డీ ఎన్‌.నాగేశ్వరరావు సూచనల మేరకు డైరెక్టర్‌ దీక్షితులు ఆధ్వర్యంలో కర్మాగారం పరిధిలోని చెరకు ఉత్పత్తిదారులు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధి

సేంద్రియ ఎరువులతో చెరకు ఉత్పత్తి
ఆదాయం.. అధిక దిగుబడి లక్ష్యం
మహారాష్ట్ర కమతాల సందర్శనతో అవగాహన
త్వరలో 15 మండలాల రైతుల శిక్షణ
ఏర్పాట్లు చేస్తున్న ఎన్‌సీఎస్‌ కర్మాగారం 
 
 
సీతానగరం: రైతులు అధికాదాయం పొందాలి. మంచి దిగుబడినిచ్చే పంటలు పండించాలి.. ఇదే లక్ష్యంతో ఎన్‌సీఎస్‌ కర్మాగారం రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో నేర్చుకున్న పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది.  కర్మాగారం ఎమ్‌డీ ఎన్‌.నాగేశ్వరరావు సూచనల మేరకు డైరెక్టర్‌ దీక్షితులు ఆధ్వర్యంలో కర్మాగారం పరిధిలోని చెరకు ఉత్పత్తిదారులు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించడానికి చర్యలు చేపట్టారు. రసాయనాల రహిత ఎరువులను ఉత్పత్తి చేసి పంటలను పండించేందుకు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రకతి వ్యవసాయ నిపుణుడు, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత పాలేకర్‌ విధానాలను లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ కర్మాగారం పరిధిలోని 15 మండలాల చెరకు రైతులకు గ్రామసభలు నిర్వహించి వివరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇటీవల మహారాష్ట్రలో చెరకు సాగు చేస్తున్న ప్రాంతాలకు రైతులు, సిబ్బంది, అధికారులను తీసుకెళ్లింది. అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్‌ సూచనల మేరకు కత్రిమ ఎరువుల రహిత పంటల సాగు, సేంద్రియ ఎరువుల తయారీ, మిశ్రమ పంటల సాగు విధానంపై 36 మంది సభ్యుల ప్రతినిధి బందం మహారాష్ట్రలో శిక్షణ పొందింది. ఆగస్టు నెలలో బారామతి, సోలాపూర్, షల్టాన్, ఇందాపూర్‌ తదితర ప్రాంతాల్లోని రైతుల కమతాలను సందర్శించి వారి అనుభవాలను తెలుసుకుంది. అక్కడి రైతులు సేంద్రియ ఎరువుతో పండిస్తున్న పంటలపై పొందిన అవగాహనతో ఎన్‌సీఎస్‌ యాజమాన్యం 2016–17 సీజన్‌లో ప్రతి రైతు ఎకరా విస్తీర్ణంలో పాలేకర్‌ విధానంలో చెరకు సాగు చేపట్టేలా రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌ నెల నుంచి రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
  
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం 
 
 డ్రిప్‌ విధానంతో నీరందిస్తూ చెరకు పండిస్తే ఎకరం విస్తీర్ణంలో 50 నుంచి 70 టన్నుల చెరకు పంట దిగుబడి వస్తుంది. రసాయనిక ఎరువైతే 5 రోజుల్లో, సేంద్రియ ఎరువైతే మూడు నెలల్లో ఫలితాలనిస్తుంది. పాడిపశువుల పేడ, మూత్రంతో ఎరువును తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నారు. సోలాపూర్‌లో 27 ఎకరాల విస్తీర్ణంగల కల్యాణీ ఫామ్‌లో 30 ఆవులు, గేదెలు, 10 నాటు పశువులు పెంచుతున్నారు. వాటì  పేడ, మూత్రంతో ద్రవ జీవామతం, ఘన జీవామతం తయారుచేసి పంటపొలాలకు ఎరువుగా వినియోగిస్తున్నారు.
 
ఫోనెక్స్‌ విధానంతో గడ్డి ఉత్పత్తి
పాడిపశువులకు పచ్చిగడ్డి లభించకపోవడంతో నీడలో ఫొనెక్స్‌ పచ్చగడ్డి ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. మూడు కేజీల గడ్డి విత్తనాలను నాటితే పదిహేను రోజుల్లో 30 పాడిపశువులకు సరిపడే పచ్చిగడ్డి సిద్ధమవుతుంది. మహారాష్ట్రలో చెరకు సాగుచేస్తున్న పంటభూముల్లో మిశ్రమ పంటలుగా అల్లం, వెల్లుల్లి, నీరుల్లి, బీట్‌రూట్, వేరుశనగ, మినుము, మిరప, చిక్కుడు, మునగ పంటలు పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులను పండ్ల తోటల పెంపకానికి కూడా వినియోగిస్తున్నారు. రైతులు పండించే చెరకు విధానంలో తారెల వెడల్పు 5 నుంచి 8 అడుగుల దూరంలో చెరకు నాటినా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో అదే విధానాన్ని ఇక్కడి రైతులకు వివరించాలని నిర్ణయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement