కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మచిలీపట్నానికి చెందిన ఆలీ(20) మిత్రులతో కలసి సోమవారం ఉదయం బీచ్‌కు వెళ్లాడు. సుమద్రంలో చాలా లోతు వరకు వెళ్లడంతో అదే సమయంలో వచ్చిన అలకు ఆలీ గల్లంతయ్యాడు. అతడి కోసం మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.