తెలంగాణ విమోచనపై ప్రచారభేరి | telangana vimochana day on september 17th | Sakshi
Sakshi News home page

తెలంగాణ విమోచనపై ప్రచారభేరి

Aug 21 2016 12:38 AM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణ విమోచన దినంపై ప్రజ లకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) మంత్రి శ్రీనివాస్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. శనివారం హన్మకొండ ఎన్‌జీఓఎస్‌ కాలనీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా కమిటీ సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

హన్మకొండ :  తెలంగాణ విమోచన దినంపై ప్రజ లకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) మంత్రి శ్రీనివాస్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. శనివారం హన్మకొండ ఎన్‌జీఓఎస్‌ కాలనీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా కమిటీ సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. దీనిపై సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో కలెక్టర్, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించాలన్నారు. 23న షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సభను జరపాలన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్‌ 10న ఆమె స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.   కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి పాల్గొననున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు రాజమౌళి, డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, పెదగాని సోమయ్య, బానోత్‌ దిలీప్‌నాయక్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, రవళి, కొత్త దశరథం, విజయారావు, చందుపట్ల కీర్తి, కుమారస్వామి, కేవీఎల్‌ఎన్‌.రెడ్డి, సత్యనారాయణరావు, శ్రీరాముల మురళీమనోహర్‌రావు, త్రిలోకేశ్వర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement