ఆక్వా పార్క్‌ వద్దంటూ మహిళల వినూత్న నిరసన | stop aqua park | Sakshi
Sakshi News home page

ఆక్వా పార్క్‌ వద్దంటూ మహిళల వినూత్న నిరసన

Jul 19 2016 9:37 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఆక్వా పార్క్‌ వద్దంటూ మహిళల వినూత్న నిరసన

ఆక్వా పార్క్‌ వద్దంటూ మహిళల వినూత్న నిరసన

మొగల్తూరు : జీవనది లాంటి గొంతేరు డ్రెయిన్‌ను నాశనం చేసి తమ పొట్టలు కొట్టవద్దని మహిళలు గొంతెత్తి నినదించారు. మంగళవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరు డ్రెయిన్‌లో పడవలపై వెళ్లి నీటి మధ్యలో ఆందోళన చేశారు.

మొగల్తూరు : జీవనది లాంటి గొంతేరు డ్రెయిన్‌ను నాశనం చేసి తమ పొట్టలు కొట్టవద్దని మహిళలు గొంతెత్తి నినదించారు. మంగళవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరు డ్రెయిన్‌లో పడవలపై వెళ్లి నీటి మధ్యలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ తాత ముత్తాతల నుంచి ఈ యేరుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. తమ కళ్లెదుటే యనమదుర్రు డ్రెయిన్‌ను నాశనం చేసి మత్స్యకారుల పొట్టకొట్టారని, వేటే జీవనంగా సాగిస్తున్న తమ బతుకులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో ఏర్పాటు చేసే ఆక్వా పరిశ్రమను వెంటనే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమాని నాగేశ్వరరావు, నాగిడి రాంబాబు, కొల్లాటి మంగమ్మ, వాటాల ధనలక్ష్మి, సొర్రా సూర్యావతి, బర్రిచల్లాలు, వాటాల సరస్వతి, తిరుమాని సుమంగళి, గాడి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement