రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయలు | six injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయలు

Mar 6 2017 12:17 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆస్పరి మండలం కారుమంచి దగ్గర ఆదివారం ఆటో బోల్తా పడటంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

 –ముగ్గురి పరిస్థితి విషమం
– కర్నూల్‌కు తరలింపు
ఎమ్మిగనూరురూరల్: ఆస్పరి మండలం కారుమంచి దగ్గర ఆదివారం ఆటో బోల్తా పడటంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు..పత్తికొండ మండలం చిన్నçహోళ్తి గ్రామానికి చెందిన ఆరుగురు కోడుమూరు దగ్గర ప్యాలకుర్తిలో ఆంజనేయస్వామి దర్శించుకొని పంచాగం చూయించుకునేందుకు ఆటోలో ఉదయం వెళ్లారు. తిరుగుప్రయాణంలో కారుమంచి దగ్గర ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ఉరుకుందు, ఖాసీం, వడ్డె మహలింగప్ప, నారాయణస్వామి, పెద్ద నరసప్ప, చిన్నారి షమీనాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదంలో డ్రైవర్‌ చెవి తెగిపోగా, చిన్నారి  తలకు బలమైన గాయమైంది. అలాగే వడ్డె మహలింగప్ప సృహలేకుండా పడిపోయాడు. ప్రథమ చికిత్స అనంతంర  ఈ ముగ్గురుని మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement