విన్‌డియాగా రావాలి | Should vindiyaga | Sakshi
Sakshi News home page

విన్‌డియాగా రావాలి

Aug 5 2016 1:10 AM | Updated on Sep 4 2017 7:50 AM

ప్రపంచ క్రీడా పండుగకు రియో ముస్తాబైంది. యూనివర్సల్‌ సంబురానికి ఐదు ఖండాలు.. 206 దేశాలు.. 28 క్రీడలు.. 306 ఈవెంట్స్‌.. 10 వేల మందికి పైగా క్రీడాకారులు.. 17 రోజులు.. కళ్లు చెదిరే రికార్డులు.. మిరుమిట్లు గొలిపే ఫీట్స్‌.. చిరుత పరుగులా అథ్లెట్లు.. ఆకాశాన్నంటేలా విన్యాసాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలు చాలవు.. కొలిచేందుకు కొలమానం సరిపోదు.

నేటి నుంచి 
రియో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం
భారత క్రీడాకారులపై 
ఓరుగల్లు వాసుల ఆశలు
దేశ క్రీడాఖ్యాతిని చాటాలని ఆకాంక్ష
వరంగల్‌ స్పోర్ట్స్‌ : 
ప్రపంచ క్రీడా పండుగకు రియో ముస్తాబైంది. యూనివర్సల్‌ సంబురానికి ఐదు ఖండాలు.. 206 దేశాలు.. 28 క్రీడలు.. 306 ఈవెంట్స్‌.. 10 వేల మందికి పైగా క్రీడాకారులు.. 17 రోజులు.. కళ్లు చెదిరే రికార్డులు.. మిరుమిట్లు గొలిపే ఫీట్స్‌.. చిరుత పరుగులా అథ్లెట్లు.. ఆకాశాన్నంటేలా విన్యాసాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలు చాలవు.. కొలిచేందుకు కొలమానం సరిపోదు. విశ్వం మొత్తం ఒకే చోట ఏకమైన దృశ్యం.. అద్భుత ప్రతిభ.. ప్రపంచ మేటి క్రీడాకారులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలతో కూడిన రియో ఒలింపిక్స్‌ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. 125 కోట్ల భారతీయుల కలలను సాకారం చేసేందుకు 119 మందితో కూడిన భారత క్రీడా బృందం రియోకు ఇటీవల తరలివెళ్లింది. ఈ మేరకు యావత్‌ భారతదేశం ఒలంపిక్‌ రికార్డులపై ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమం లో ఓరుగల్లు క్రీడాలోకం భారత క్రీడా ముద్దుబిడ్డలకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెబుతూ పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తుంది. గతంలో సాధించిన పతకాల కంటే ఈసారి రెండింతలు సాధిస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ క్రీడలను పురస్కరించుకుని  జిల్లాలోని పలువురు క్రీడాకారులు, అధికారులు ‘సాక్షి’కి వారి అభిప్రాయాలు వెల్లడించారు. అవి వారి మాటల్లోనే.. 

Advertisement

పోల్

Advertisement