విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి | should solve probelms of education system | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

Aug 11 2016 11:55 PM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

బెల్లంపల్లి : విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలను తీర్చాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కరువైందని తెలిపారు.
     ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజినీరింగ్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాలను ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ కృష్ణదేవరాయులు, నాయకులు సుచిత్, వెంకటేశ్, మహే, బాలకృష్ణ, కిరణ్‌సింగ్, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement