ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతలపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ రెడ్డి మండిపడ్డారు.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతలపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బుధవారం నెల్లూరులో మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా టీడీపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
ఢిల్లీలో మోదీని పొగిడి... రాష్ట్రానికి వచ్చి ఏంచేయలేదని టీడీపీ నేతలు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఇంతవరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని సురేష్ రెడ్డి ప్రశ్నించారు.