విద్యార్థులకు ఏకీకృత ధ్రువీకరణ పత్రాన్ని పాఠశాలల్లోనే అందజేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఈనెల 9న చేపట్టనున్న ‘‘సదా మీ సేవలో’’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ) అనిల్ చంద్ర పునేఠా నిర్ణయించారని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం విజయవాడ నుంచి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అర్బన్ : విద్యార్థులకు ఏకీకృత ధ్రువీకరణ పత్రాన్ని పాఠశాలల్లోనే అందజేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఈనెల 9న చేపట్టనున్న ‘‘సదా మీ సేవలో’’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ) అనిల్ చంద్ర పునేఠా నిర్ణయించారని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం విజయవాడ నుంచి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘సదా మీ సేవలో’’ కార్యక్రమం గురించి బుధవారం విజయవాడలో సీసీఎల్‌ఏకి ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వారు చదివేచోటే కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మొబైల్ ‘మీసేవ’ కేంద్రాల ద్వారా నేరుగా పాఠశాలల్లోనే పంపిణీ చేస్తామన్నారు.