సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
సాక్షి, తిరుమల: సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చిన ఆమె.. ధ్వజస్తంభానికి మొక్కుకుని, శ్రీవారి దర్శించుకున్నారు.
ఈసందర్భంగా ఆలయ అధికారులు రకుల్ కు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన నటిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. రకుల్ కూడా అభిమానులను ‘‘హాయ్...హాయ్ ’’ అంటూ చిరునవ్వుతో పలకరిస్తూ సందడి చేశారు.