రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలపై అవగాహన | new implimentations in revenue depeartment | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలపై అవగాహన

Oct 18 2016 11:25 PM | Updated on Sep 4 2017 5:36 PM

ఎన్ని కొత్త సంస్కరణలొచ్చినా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని, ప్రజలకు సత్వరసేవలు అందించి రెవెన్యూ శాఖపై సదభిప్రాయాన్ని పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలు అమలు తీరుపై క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఏలూరు (మెట్రో) : ఎన్ని కొత్త సంస్కరణలొచ్చినా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని, ప్రజలకు సత్వరసేవలు అందించి రెవెన్యూ శాఖపై సదభిప్రాయాన్ని పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలు అమలు తీరుపై క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రస్తుతం ప్రజలకు 75 రకాల సేవల్లో ముఖ్యంగా పది రకాల సేవల కోసమే ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, అటువంటి సేవలను గుర్తించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందిస్తే రెవెన్యూ యంత్రాంగం ప్రజలతో మమేకం కాగలదని చెప్పారు. ఆర్డీవోలు నంబూరి తేజ్‌భరత్, బి.శ్రీనివాసరావు, ఎస్‌.లవన్న, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్, కుకునూరు సబ్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement