జలవిద్యుత్ కేంద్రాల్లో పీక్‌లోడ్ అవర్స్‌లో స్వల్పంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు అడపా దడపా ఉత్పత్తి చేస్తున్నారు.
స్వల్పంగా విద్యుదుత్పత్తి
Feb 11 2017 11:36 PM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు : జలవిద్యుత్ కేంద్రాల్లో పీక్‌లోడ్ అవర్స్‌లో స్వల్పంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు అడపా దడపా ఉత్పత్తి చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.467 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 1.816 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జునసాగర్‌కు 4,485 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనివా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు వదులుతున్నారు. 846.10 అడుగుల నీటిమట్టం వద్ద డ్యాంలో 72.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
Advertisement
Advertisement