ప్రాథమిక స్థాయిలోనే కరాటే శిక్షణ | karate must in primary stage | Sakshi
Sakshi News home page

ప్రాథమిక స్థాయిలోనే కరాటే శిక్షణ

Jul 21 2016 11:45 PM | Updated on Sep 4 2017 5:41 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించాలని పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య అన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించాలని పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య అన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎంఎస్‌ఏ పథకం కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇటీవల మూడునెలల కరాటే శిక్షణ ఇచ్చారని, ఏడాది మొత్తం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
   పాఠశాలల్లో ప్రాథమికంగా కరాటే శిక్షణ ఇస్తే పదో తరగతి వచ్చేసరికి విద్యార్థులు బ్లాక్‌బెల్టు స్థాయికి ఎదిగి మంచి ప్రావీణ్యం సంపాదిస్తారని అన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా వినతి పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కరాటేలో శిక్షణ పొందిన మాస్టర్లను పాఠశాలల్లో నియమించి శిక్షణ ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం మహిళలు, బాలికలు తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో తైక్వాండో మాస్టర్లు సురేందర్, పరమేశ్వరి, కరాటే మాస్టర్లు శివకష్ణ, ఓంకార్, రమేశ్‌ రాథోడ్, ప్రమీల, పూజిత, సరిత, సీమ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement