'మత్తులో ఉన్నా..ఏం జరిగిందో తెలీదు' | i do not know about the rape case, convict rishab | Sakshi
Sakshi News home page

'మత్తులో ఉన్నా..ఏం జరిగిందో తెలీదు'

Aug 21 2015 3:36 PM | Updated on Jul 28 2018 8:51 PM

'మొన్న రాత్రి ఏం జరిగిందో నాకు తెలీదు.. పూర్తిగా మత్తులో ఉన్నా. నేను అమాయకుడ్ని' అని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రిషబ్ సింగ్ ఆరోపిస్తున్నాడు.

విశాఖ: 'మొన్న రాత్రి ఏం జరిగిందో నాకు తెలీదు.. పూర్తిగా మత్తులో ఉన్నా. నేను అమాయకుడ్ని' అని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రిషబ్ సింగ్ ఆరోపిస్తున్నాడు.   రిషబ్ ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి తనకేమీ తెలియదని రిషబ్ తెలిపాడు. మూట్ కోర్ట్ వర్క్ కోసం వారి రూమ్ కు వెళ్లిన క్రమంలో అంతా కలిసి మందు తీసుకున్నామన్నాడు. అయితే తాను మాత్రం మద్యం మత్తులో ఉండటం వల్ల ఏమీ తెలియదన్నాడు. పోలీస్ స్టేషన్ కు వచ్చేంతవరకూ తనకు అసలు ఏమీ తెలియదని నిందితుడు రిషబ్ మీడియాకు తెలిపాడు.


గత రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో  ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.  తాను నిద్రిస్తున్న సమయంలో రిషబ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రిషబ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement