రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయినట్లు చెబుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు తెలిపారు. రైతులు నష్టపోయినట్లు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మండలంలోని కొప్పులలో వేసిన మిర్చి పంటలను హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది.
శాయంపేట : నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయినట్లు చెబుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు తెలిపారు. రైతులు నష్టపోయినట్లు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మండలంలోని కొప్పులలో వేసిన మిర్చి పంటలను హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది. మహాతేజ రకం మిరప విత్తనాలు నాటగా పూత, కాత లేక నష్టపోయామని రైతులు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు అధికారుల బృందం శనివారం రాత్రి కొప్పులలోని పలువురు రైతుల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాలు నకిలీవిగా ప్రాథమికంగా నిర్దారించామన్నారు. అయితే, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం మిరప మొక్కలలోని భాగాలు, ఆకులను ల్యాబ్‌కు పంపిస్తామని, ఆ తర్వాత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు డాక్టర్ సైదయ్య, మద¯ŒSమోహ¯ŒS, రాజారత్నం, శివానంద్, తో పాటు జేడీఏ ఉష, ఏడీహెచ్ అక్బర్, ఏడీఏ నాగరాజు, వ్యవసాయ అధికారి భైరి మాధవి, ఎంపీటీసీ బగ్గి రమేశ్, సర్పంచ్ కుమారస్వామి పాల్గొన్నారు.