breaking news
formerski
-
రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
శాయంపేట : నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయినట్లు చెబుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు తెలిపారు. రైతులు నష్టపోయినట్లు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మండలంలోని కొప్పులలో వేసిన మిర్చి పంటలను హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది. మహాతేజ రకం మిరప విత్తనాలు నాటగా పూత, కాత లేక నష్టపోయామని రైతులు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు అధికారుల బృందం శనివారం రాత్రి కొప్పులలోని పలువురు రైతుల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనాలు నకిలీవిగా ప్రాథమికంగా నిర్దారించామన్నారు. అయితే, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం మిరప మొక్కలలోని భాగాలు, ఆకులను ల్యాబ్‌కు పంపిస్తామని, ఆ తర్వాత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు డాక్టర్ సైదయ్య, మద¯ŒSమోహ¯ŒS, రాజారత్నం, శివానంద్, తో పాటు జేడీఏ ఉష, ఏడీహెచ్ అక్బర్, ఏడీఏ నాగరాజు, వ్యవసాయ అధికారి భైరి మాధవి, ఎంపీటీసీ బగ్గి రమేశ్, సర్పంచ్ కుమారస్వామి పాల్గొన్నారు. -
బాధిత రైతులందరికీ పరిహారం
పాలకుర్తి : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులందరికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తుందని రాష్ట్ర పరిశీలక బృందం తెలిపింది. మంగళవారం వ్యవసాయ శాఖ రాష్ట్ర పరిశీలక బృందం నియోజకవర్గంలో పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో క్షేత్ర పర్యటన చేసింది. వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి అధికారులు టి.రాజారత్నం, దాసరి అజయ్‌కుమార్ ఘోష్ స్థానిక వ్యవసాయాధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని తెలిపారు. పంట నష్టం వాస్తవ నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత పరిహారం బాధిత రైతులకు అందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లకీష్మ నారాయణపురం శివారులో రైతు దొండ ఉప్పలయ్య పొలంలో వరదకు నేలకొరిగిన వరిపంటను పరిశీలించారు. పాలకుర్తి ఏడీఏ సంధ్యారాణి, ఏఈవో సరిత, వీఆర్వో యాకయ్య ఉన్నారు. కోలుకొండ గ్రామంలో... కోలుకొండ(దేవరుప్పుల) : వర్షానికి దెబ్బతిన్న పత్తి, వరి పంటల నష్టంపై సర్వే బృందం మంగళవారం కోలుకొండ తదితర గ్రామాల్లో పర్యటించి సర్వే చేసిం ది. ఈ సందర్భంగా సర్వే బృందం ప్రతినిధి డాక్టర్ డి.అజయ్‌కుమార్‌ఘోష్ మాట్లాడుతూ జిల్లాలో రెండు రోజులుగా సర్వే చేస్తున్న క్రమంలో ప్రాథమికంగా 500 హె క్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించామని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పత్తి, వరి పంట తీవ్రంగా నష్టపోగా నర్సంపేట డివిజన్లో సోయాబీన్ పంట నష్టపోయినట్టు పేర్కొన్నారు. దేవరుప్పు ల మండలంలో అధిక వర్షపాతం వల్ల 1080 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. పరి శీలన బృందంలో టి.రాజరత్నం, పాలకుర్తి ఏడీఏ సంధ్యరాణి, వ్యవసాయాధికారి ఎస్.కరుణాకర్, ఏఈఓ సూదగాని సాగర్ పాల్గొన్నారు. తీగారం గ్రామంలో... జఫర్‌గఢ్ : భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి కమిషనరేట్ సర్వే బృందం మండలంలోని తీగారం గ్రామంలో మంగళవారం పర్యటించింది. ఈసందర్భంగా వర్షాలతో పత్తి పంట దెబ్బతినగా వరి, మొక్కజొన్న తదితర పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయినట్లు బాధిత రైతులు అధికారుల బృందానికి వివరించారు. కాగా జరిగిన నష్టాన్ని నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామని బాధిత రైతులకు వారు హామీ ఇచ్చారు. సర్వే బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయ సంయుక్త సంచాలకులు రాజరత్నం, డాక్టర్ అజయ్‌కుమార్‌ఘోష్, ఏడీఏ సుగుణాకర్, ఏఓ మురళి, సర్పంచ్ ఎల్మకంటి సుజాత, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు.