తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సెంటర్‌లో ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న కాపు యువత
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సెంటర్‌లో ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న కాపు యువతలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాపు రిజర్వేషన్ల కోసం తమ నేత్ర ముద్రగడకు మద్దతుగా ఎనిమిది మంది ఇక్కడ దీక్ష చేస్తున్నారు.
ఆదివారం రాత్రి రెవెన్యూ అధికారులు దీక్షా స్థలికి వద్దకు చేరుకుని దీక్షలో ఉన్న బోడపాటి తాతాజీ, పొలిశెట్టి నాగబాబు, అప్పన సురేష్‌బాబులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉద్రిక్తత వాతవారణం నెలకొని ఉంది.