సాతనూరు గ్రామానికి చెందిన హరిజన దావీద్(30) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతి చెందాడు.
కాటేసిన కరెంట్
Apr 11 2017 12:07 AM | Updated on Oct 1 2018 2:44 PM
కోసిగి : సాతనూరు గ్రామానికి చెందిన హరిజన దావీద్(30) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతి చెందాడు. ఈ ఏడాది తనకున్న రెండెకరాల పొలంలో మిరప పంటను సాగు చేశాడు. కాపు కొచ్చిన మిరపను కోత కోసి పొలంలో ఆరబెట్టాడు. పంటకు గిట్టుబాటు లేక పోవడంతో మార్కెట్‌కు తరలించికుండా పొలంలోనే నిల్వ చేశాడు. మిర్చి పంటను నీటితో తడిపివేసేందుకు గ్రామ శివారులోని హౌస్కూల్ వెనుక భాగంలో బోరు నుంచి సమీపంలోని ట్యాంకర్‌కు నీటిని ఎక్కించి, అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మోటార్‌ను ఆన్ చేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోషమ్మ, ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Advertisement
Advertisement