ఢాల్ఫిన్‌ డేల్‌ పాఠశాలలో పూల అలంకరణ | dolphin dale school was in flower day | Sakshi
Sakshi News home page

ఢాల్ఫిన్‌ డేల్‌ పాఠశాలలో పూల అలంకరణ

Nov 5 2016 6:39 PM | Updated on Sep 4 2017 7:17 PM

పట్టణంలోని ఢాల్ఫిన్‌ డేల్‌ పాఠశాలలో శనివారం సాయంత్రం ఫ్లవర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ పంజం సుకుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల పూలతో పలు అలంకరణలు ప్రదర్శించారు. ముఖ్యంగా ఈనెలలో రానున్న చిల్డ్రన్స్‌ డేను పురష్కరించుకుని నెహ్రూ చిత్రాన్ని గీసి చుట్టూ పూలతో అలంకరించారు.

రైల్వేకోడూరు రూరల్‌:  పట్టణంలోని ఢాల్ఫిన్‌ డేల్‌ పాఠశాలలో శనివారం సాయంత్రం ఫ్లవర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ పంజం సుకుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల పూలతో పలు అలంకరణలు ప్రదర్శించారు. ముఖ్యంగా ఈనెలలో రానున్న చిల్డ్రన్స్‌ డేను పురష్కరించుకుని నెహ్రూ చిత్రాన్ని గీసి చుట్టూ పూలతో అలంకరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ పంజం సుకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఫ్లవర్స్‌ డే కావడంతో విద్యార్థులు కార్తీక మాసంలో దొరికే వివిధ రకాలు పూలతో పలు ఆకృతులలో అలంకరించారన్నారు. అలాగే విద్యార్థులకు బెలున్, నిమ్మకాయ లాంటి ఆటల పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో విజేతలకు చిల్ట్రన్స్‌ డే సందర్భంగా బహుమతులు అందిస్తామన్నారు.  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలా కుమార్, పంజం శ్రీనిధి, పీఈటీ రహంతుల్లా, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాధ్యాయుడు చెంగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement