చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేస్తాం
చింతలపూడి: చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖా మంత్రి పీతల సుజాత తెలిపారు.
చింతలపూడి: చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖా మంత్రి పీతల సుజాత తెలిపారు. గురువారం చింతలపూడి విచ్చేసిన మంత్రి సుజాతను ఎత్తిపోతల పధకం రైతులు కలిశారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించకుండ కాల్వ పనులు చేపడుతున్నారని చెప్పారు. అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టారని చింతలపూడి భూనిర్వాసితుల కమిటీ నాయకులు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, సిహెచ్ అంజిబాబు, చిట్లూరి లచ్చిబాబులు ఆమె దృ
ష్టికి తీసుకువెళ్ళారు. రైతులు ఆందోళన చెందవద్దని, న్యాయమైన పరిహారం అందేలా చూస్తాన ని, అప్పటి వరకు కాల్వ పనులు చేపట్టవద్దని తహశీల్దార్‌కు చెప్పారు. అదే విధంగా రైతులపై పెట్టిన కేసులను తక్షణం ఉప సంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆమె వెంట సిహెచ్ సీతారామయ్య, ఎం ఈశ్వర్‌కుమార్, బోడా భూషణం,సయ్యద్ బాబు, ఆశీర్వాదం, వీరేంద్ర, తాటి అప్పారావు , టి రామారావులు ఉన్నారు.