నల్లమలలో పులులు, జంతువుల గణన | Calculation of animals and Tigers in nallamala | Sakshi
Sakshi News home page

నల్లమలలో పులులు, జంతువుల గణన

May 24 2016 9:11 AM | Updated on Sep 4 2017 12:46 AM

నల్లమలలో పులులు, జంతువుల గణన

నల్లమలలో పులులు, జంతువుల గణన

నల్లమల అభయారణ్యంలో పులులు, జంతువుల గణన ప్రారంభమైంది.

అచ్చంపేట: నల్లమల అభయారణ్యంలో పులులు, జంతువుల గణన ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన లెక్కింపు కార్యక్రమం 26వ తేదీ వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలోని 70 బీట్లలో కొనసాగుతోంది.  బీట్ ఆఫీసర్ లేదా సెక్షన్ ఆఫీసర్లతోపాటు ఇద్దరు బేస్ క్యాంపు వాచర్లు ఈ గణనలో పాల్గొంటారు. ఈ లెక్కింపులో సుమారు 250 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.  ప్రతి బీట్‌లో రెండు నుంచి నాలుగు కి.మీ దూరం లైనింగ్ ఏర్పాటు చేసి అందులో ఉన్న చెట్లు, గడ్డితో పాటు అక్కడి వచ్చిపోయే జంతువుల సమాచారం సేకరిస్తారు. సేకరించిన వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు పంపిస్తారు. 6 రోజులపాటు జరిగే గణనలో సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు, టైగర్ ట్రాకర్స్ పాల్గొంటారు. వీరు బృందాలుగా విడిపోయి గణన చేస్తారు. పులులు, చిరుతపులులు ప్లగ్ మార్కులు (గుర్తుల)ను సేకరించి కంప్యూటర్‌లో నమోదు చేస్తారు.

 పూర్తయిన కెమెరా ట్రాప్స్
 అభయారణ్య ప్రాంతాన్ని 400 చ. కి.మీ ఒక బ్లాక్ చొప్పున ఐదు బ్లాక్‌లుగా విభజించారు. ఈ బ్లాక్‌లో పులుల సంచారం ఎక్కువగా ఉండే క్షేత్రాలను గుర్తించి అక్కడి వృక్షాలకు కెమెరా ట్రాప్స్‌లను బిగించారు. అభయారణ్యంలో 120 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. జనవరి నుంచి మార్చి వరకు  పులుల సంచారంపై సమాచారాన్ని సేకరించారు.  ఇలా మొత్తం ఐదు బ్లాక్‌ల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పులుల లెక్క తేలుస్తామని డీఎఫ్‌వో తెలిపారు.

 సంప్రదాయ గణన..
 ప్రతిఏటా రాష్ట్ర స్థాయిలో కెమెరా ట్రాప్ మానిటరింగ్ ద్వారా పులుల గణన జరిగినా సంప్రదాయ గణన చేపట్టాలని నిర్ణయిం చారు. ఇప్పటికే అటవీశాఖ ఇందుకు అవసరమైన లైనింగ్ ఏర్పాటు చేసింది. పులుల గణన పాదముద్రల ద్వారా జరుగుతోంది. ఇవి అత్యధింగా నీటి వనరులు ఉన్న ప్రాంతంలో కనిపిస్తాయి. అటవీశాఖ అధికారులు వాహనాలు వెళ్లగలిగే నీటి వనరుల ప్రాంతంలోనే లెక్కలు తీస్తున్నారు తప్ప అభయారణ్య లోతట్టు అటవీప్రాంతంలో సెన్సెక్స్ జరగడం లేదన్న విమర్శలు ఉన్నా యి.  2004లో 19 పులులుంటే 2005లో సంఖ్య 14 పడిపోయింది. 2006 నాటికి వాటి సంఖ్య రెండింతలు పెరిగి 30కి చేరిం ది. ఆదే 2013 నాటికి సగానికి పడిపోయి 2015లో 22 పులులు వచ్చాయి. చిరుతలు 2015 నాటికి 49కి పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement