ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మోదీ, చంద్రబాబునాయుడు తోడుదొంగలని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదాపై కనీసం ఒక మాట కూడా చెప్పకపోవడం, హామీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సెంటిమెంట్లతో కాలం గడుపుకోవాలని ఆ ఇద్దరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.