బాలసదన్‌కు బాలిక అప్పగింత | a girl child hold to sadan | Sakshi
Sakshi News home page

బాలసదన్‌కు బాలిక అప్పగింత

Oct 3 2016 12:20 AM | Updated on Sep 4 2017 3:55 PM

బాలసదన్‌కు బాలిక అప్పగింత

బాలసదన్‌కు బాలిక అప్పగింత

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తప్పిపోయిన ఓ బాలికను బాలసదన్‌కు అప్పగించారు.

యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తప్పిపోయిన ఓ బాలికను బాలసదన్‌కు అప్పగించారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ బాలిక ఏడ్చుతూ తిరువీధుల వెంట తిరుగుతుంది. స్థానికులు, వ్యాపారస్తులు యాదగిరిగుట్ట ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆ బాలికను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు, ఊరు పేర్లను వెల్లడించడం లేదని ఎస్‌ఐ తెలిపారు. దీంతో భువనగిరి బాలసదన్‌కు సమాచారం అక్కడి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement