రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా 21 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత చెప్పారు.
‘పౌరసరఫరాల ద్వారా 21 పెట్రోల్ బంక్‌లు’
Jul 29 2016 10:23 AM | Updated on Sep 3 2019 9:06 PM
	శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా 21 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత చెప్పారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రెండు బంకులు నడుస్తున్నాయని, వాటిని విస్తరిస్తామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, జేసీ వివేక్ యాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆర్‌డీఓ దయానిధి తదితరులు పాల్గొన్నారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
