కదులుతున్న బస్‌లో భర్త, కుమార్తె ఎదుటే.. | Woman Molested In Moving Bus | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్‌లో భర్త, కుమార్తె ఎదుటే..

Jul 1 2019 10:28 AM | Updated on Jul 1 2019 10:29 AM

Woman Molested In Moving Bus - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

కోల్‌కతాలో రెచ్చిపోయిన పోకిరీలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కదులుతున్న బస్‌లో భర్త, కుమార్తె ఎదుటే ఓ మహిళపై పోకిరీలు రెచ్చిపోయారు. దుల్గర్‌-సెల్ధా రూట్‌లో వెళుతున్న బస్‌లో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. వారి ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు ఎమర్జెన్సీ నెంబర్‌ 100కు డయల్‌ చేయగా సెల్ధాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రి వద్ద నిందితుల్లో ఒకడైన మహ్మద్‌ ఖాన్‌ (24)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భర్త, కుమార్తెతో కలిసి బస్‌లో ప్రయాణిస్తున్న మహిళను వెల్లింగ్టన్‌ క్రాసింగ్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. మహిళ పోలీసులకు డయల్‌ చేసిన ఎనిమిది నిమిషాల్లోనే ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రి వద్ద బస్‌ను ఆపిన స్ధానిక పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. పారిపోయిన మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement