ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి | Teacher Suspicious death in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

Apr 25 2019 2:11 PM | Updated on Apr 25 2019 2:11 PM

Teacher Suspicious death in Vizianagaram - Sakshi

ఉపాధ్యాయుడు యువరాజు మృతదేహం

మక్కువ: మండల కేంద్రంలోని ఆర్‌సీఎం వీధికి చెందిన ఉపాధ్యాయుడు బొమ్మాలి యువరాజు (36) బుధవారం అనుమానాస్పదంగా  మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చెముడు ప్రాథమిక పాఠశాలలో యువరాజు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.  రెండు రోజులుగా ఛాతినొప్పితో బాధ పడుతున్నాడు. పైగా మద్యం తాగడంతో మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యువరాజు భార్య కస్తూరి మాత్రం తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇది సహజ మరణం కాదని ఆరోపిస్తూ స్థానిక పోలీసులకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. దీంతో హెచ్‌సీ కృపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement