బాత్రూంలో బంధీగా చిన్నారి ; చివరికి

School Student Died In Bathroom At Punganuru Mincipal School - Sakshi

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పుంగనూరు మున్సిపల్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నహర్షవర్ధన్‌ను బాత్రుమ్‌లో పెట్టి తోటి విద్యార్థులు తాళం వేశారు. దీంతో భయంతో మూడు గంటలపాటు విద్యార్థి బాత్రుమ్‌లోనే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న వార్డెన్‌ వెంటనే తలుపులు తీసి చూడగా, అప్పటికే హర్ష వర్ధన్‌ తీవ్ర జ్వరంతో కింద పడిపోయి ఉన్నాడు. హుటాహుటిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. పాఠశాల ఉపాద్యాయుల నిర్లక్ష్యం కారణంగానే హర్ష వర్ధన్‌ చనిపోయాడంటూ ఆందోళనతో బంధువులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top