స్టార్‌ హీరో అభిమాని అఘాయిత్యం

Rocking Star Yash Fan Suicide Attempt - Sakshi

అభిమానం హద్దులు దాటితే అనర్థాలు తప్పవని ఎన్నోసార్లు రుజువైంది. అటాంటి దురంతమేపునరావృతమైంది. హీరో యశ్‌ పుట్టినరోజునాడు ఆయనను కలవడానికి వచ్చిన అభిమాని పెట్రోలు పోసుకుని సజీవ దహనానికి యత్నించడం కలకలం సృష్టించింది.

యశవంతపుర: ఉద్యాననగరిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ హీరోను చూడనివ్వలేదని ఒక అభిమాని శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. ప్రస్తుతం చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజా హిట్‌ చిత్రం కేజీఎఫ్‌ హీరో, రాకింగ్‌స్టార్‌ యశ్‌ పుట్టినరోజు మంగళవారమే. దీంతో హొసకెరెహళ్లిలో యశ్‌ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఆయనను చూడాలని బారులు తీరారు. యశ్‌ను చూడటానికి అనుమతించలేదని ఆక్రోశంతో రవి అనే అభిమాని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.  

శుభాకాంక్షలు చెప్పాలని  
బెంగళూరు రూరల్‌ నెలమంగళ తాలూకా శాంతినగరకు చెందిన రవి, యశ్‌కు వీరాభిమాని. యశ్‌ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలని ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది రవిని లోపలకు అనుమతించ లేదు. దీంతో కొంతసేపు వేచి చూసినా ఫలితం లేకపోయింది.  మధ్యాహ్నం అక్కడే పెట్రోల్‌ పోసుకున్నాడు. అక్కడున్నవారు రవిని నివారించే ప్రయత్నం చేయబోతుండగానే అగ్గిపుల్ల గీసుకుని అంటించుకున్నాడు. ఇతర అభిమానులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాలిన గాయాలైన రవిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి 75 శాతం శరీరం కాలి, ఆరోగ్య పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పథకం ప్రకారం ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే పెట్రోల్‌ను వెంట తెచ్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

బర్త్‌ డే జరుపుకోవడం లేదు: యశ్‌  
నటుడు యశ్‌ ప్రతి సంవత్సరం అభిమానులతో కలిసి పుట్టిన రోజును అచరించటం ఆనవాయితీగా ఉంది. ఈసారి ప్రముఖ నటుడు అంబరీశ్‌ మరణంతో తన జన్మదినం జరుపుకోవటం లేని, కేజీఎఫ్‌ను హిట్‌ చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలని ఇదివరకే ప్రకటించారు. ఇటీవలే బిడ్డకు తండ్రైన యశ్‌.. ట్విట్టర్‌ లైవ్‌లో వీడియో ద్వారా తన విజయగాథను వివరిస్తూ ఈ ఏడాది పుట్టినరోజును జరుపుకోవటం లేదని అభిమానులకు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top