మహిళ అని కూడా చూడకుండా దాడి

Madhya Pradesh 3 Muslims Thrashed By Gau Rakshaks - Sakshi

ముంబై : మహారాష్ట్రలో గోరక్షకులు రెచ్చిపోయారు. ఎద్దు మాంసం తీసుకెళ్తున్నారనే అనుమానంతో ముగ్గురు ముస్లింలను చితక బాదారు. వీరిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారు ఎద్దు మాంసం తీసుకెళ్తున్నట్లు అనుమానించిన కొందరు వ్యక్తులు.. తమను తాము గోరక్షకులుగా చెప్పుకుని వారి మీద దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాక జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ వారిని బలవంతం చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడమే కాక ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. మోదీ ఓటర్లు తయారు చేసిన ఈ మూక ముస్లింలను ఎలా హింసిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ట్విట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top