
మార్కెట్లోకి యమహా ఫేజర్ 25
ఆటోమొబైల్ సంస్థ యమహా తాజాగా 250 సీసీ సామర్ధ్యంతో ఫేజర్ 25 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.
ధర రూ. 1.28 లక్షలు
ముంబై: ఆటోమొబైల్ సంస్థ యమహా తాజాగా 250 సీసీ సామర్ధ్యంతో ఫేజర్ 25 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.28 లక్షలు (ముంబై ఎక్స్‌షోరూం రేటు). వచ్చే నెలలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఎఫ్‌జెడ్ 25 తర్వాత ఈ ఏడాది యమహా ఆవిష్కరించిన బైక్‌లలో ఇది రెండోది.
గతేడాది 7.50 లక్షల ద్విచక్ర వాహనాలు విక్రయించిన ఇండియా యమహా మోటార్.. ఈ ఏడాది 15 శాతం వృద్ధితో తొమ్మిది లక్షల మోటార్ సైకిల్స్, స్కూటర్స్‌ను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ చెప్పారు. డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరో 100 అవుట్‌లెట్లు పెంచుకుని మొత్తం 700 అవుట్‌లెట్స్‌కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.