షావోమి ‘నోట్బుక్’లు వస్తున్నాయ్... | Xiaomi Mi Notebook Air Release Date, Price and Specs | Sakshi
Sakshi News home page

షావోమి ‘నోట్బుక్’లు వస్తున్నాయ్...

Jul 28 2016 12:55 AM | Updated on Sep 4 2017 6:35 AM

షావోమి ‘నోట్బుక్’లు వస్తున్నాయ్...

షావోమి ‘నోట్బుక్’లు వస్తున్నాయ్...

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

చైనాలో ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆవిష్కరణ
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. అలాగే ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. చైనీయులు ‘రెడ్‌మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ వెబ్‌సైట్ (మి.కామ్), హోమ్‌స్టోర్లలో ఆగస్ట్ 6 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి వస్తుంది.

రెడ్‌మి ప్రొ: ఇందులో 5.5 అంగుళాల స్క్రీన్, రెండు రియర్ కెమెరాలు (13 ఎంపీ, 5 ఎంపీ), మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్, 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ యూఎస్‌బీ పోర్ట్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 జీబీ, 4 జీబీ అనే రెండు ర్యామ్ ఆప్షన్లలో లభించనుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 15,000గా ఉండొచ్చని అంచనా.

 నోట్‌బుక్ ఎయిర్: ఇందులో 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, జీఫోర్స్ 940 ఎంఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్, విండోస్ 10 ఓఎస్, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ధర రూ. 51,400గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement