షావోమి సరికొత్త ల్యాప్‌టాప్స్‌ లాంచ్‌

Xiaomi Mi Notebook Air 13.3-inch, 15.6-inch laptops launched - Sakshi

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి  రెండుకొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా  ఈసిరీస్‌లో భాగంగా  రెండు డివైస్‌లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్‌ప్లేలతో రెండు  డివైస్‌లను  ప్రారంభించింది.  8న జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్లను,  గ్లాస్‌ టచ్‌ప్యాడ్‌, బ్యాక్‌లిట్‌ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల్లో అమర్చింది.

1. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్
13.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1920x1080 పిక్సెల్స్‌  స్క్రీన్ రిజల్యూషన్‌
ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 620 కార్డు
8జీబీ ర్యామ్‌,128జీబీ స్టోరేజ్‌
ఫ్రంట్‌ఫేసింగ్‌ కెమెరా
40వాట్స్‌బ్యాటరీ
ధర రూ. 41,500

2. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్
15.6 అంగుళాల డిస్‌ప్లే
1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌
1 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం
ధర : సుమారు రూ .35,500

భారతీయ మార్కెట్లో ఈ  పరికరాలు ఎపుడు లాంచ్‌ అయ్యేది ఇంకా ప్రకటించలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top