జియో ఫోన్‌లో వాట్సప్‌ వాడండి ఇలా.. | web whatsapp on jio phone | Sakshi
Sakshi News home page

జియో ఫోన్‌లో వాట్సప్‌ వాడండి ఇలా..

Nov 19 2017 1:07 PM | Updated on Nov 19 2017 5:26 PM

web whatsapp on jio phone - Sakshi - Sakshi - Sakshi

దేశంలో సంచలనం సృష్టించిన జియో ఫీచర్‌ ఫోన్‌ను వినియోగదారులు, కాల్స్‌, డేటా ప్యాక్‌లతో ఆనందిస్తున్నా ఒకింత అంతృప్తితో ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే అందులో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లాంటి సోషల్‌మీడియా యాప్స్‌ లేకపోవడమే కారణం. ఇన్నిరోజులు స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడి ఒక్కసారిగా అవేవీ లేకపోవడంతో కొందరు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి వినియోగదారులు జియోఫోన్‌లో వాట్సప్‌ ఉపయోగించవచ్చు.
 
ఎలా అం‍టే
వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా పలు వెబ్‌బ్రౌజర్లను వర్చ్యువల్‌గా ఉపయోగించుకునే అవకాశం ఇంటర్నెట్‌లో ఉంది. తద్వారా మీ జియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయెచ్చు.  మీఫోన్‌లోని ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి https://www.browserling.com అనే సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అక్కడ పలు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌కు చెందిన పలు బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఎంచుకొని, గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని అడ్రస్‌బార్‌లో http://web.whatsapp.com అని టైప్‌చేసి టెస్ట్‌నౌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, స్క్రీన్ మీద ఓ క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తుంది. మీదగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి వాట్సప్‌ వెబ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి కోడ్‌ను స్కాన్‌ చేస్తే జియో ఫీచర్‌ ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ అవుతుంది. అయితే రెండు ఫోన్లలోనూ డేటా ఉంటేనే(ఇంటర్నెట్‌) ఉంటేనే ఇది పనిచేస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ.1300లకే స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ చేయగా ఇప్పుడు ఐడియా, వొడాఫోన్‌లతో పాటు జియో కూడా చవక ధరలో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లను అందించే పనిలో పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement