‘టెండూల్కర్’ ఫోన్‌లొచ్చాయ్...
టెక్నాలజీ సంస్థ స్మార్ట్‌రాన్ తాజాగా ‘ఎస్‌ఆర్‌టీ.ఫోన్’(క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ పేరుతో) అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ స్మార్ట్‌రాన్ తాజాగా ‘ఎస్‌ఆర్‌టీ.ఫోన్’(క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ పేరుతో) అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీన్ని బుధవారం ఇక్కడ టెండూల్కర్ విడుదల చేశారు. దీని ప్రారంభ ధర రూ.12,999గా ఉంది.
ఇందులో ఆండ్రాయిడ్ నుగోట్ ఓఎస్, 5.5 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కామ్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. 32 జీబీ వేరియంట్ ధర రూ.12,999గా, 64 జీబీ వేరియంట్ ధర రూ.13,999గా ఉందని పేర్కొంది. కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వస్తోన్న మూడో స్మార్ట్‌ఫోన్ ఇది.
ఎస్‌ఆర్‌టీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదికిపైగా ఉపకరణాలను మార్కెట్‌లోకి తీసుకువస్తామని స్మార్ట్‌రాన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేశ్ లింగారెడ్డి తెలిపారు. కాగా, ‘స్మార్ట్‌రాన్’ రూ.250 కోట్లను సమీకరిస్తోంది. సంస్థలో సచిన్ టెండూల్కర్‌కు కూడా ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ సంస్థ ఇదివరకు రూ.150 కోట్లను సమీకరించింది.


