ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్ | Piramal Enterprises to buy 20% in Shriram Capital for $334M | Sakshi
Sakshi News home page

ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్

Apr 18 2014 1:35 AM | Updated on Sep 2 2017 6:09 AM

ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్

పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా మరో పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీరాం క్యాపిటల్‌లో 20% వాటాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.

న్యూఢిల్లీ: పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా మరో పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీరాం క్యాపిటల్‌లో 20% వాటాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 2,014 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించిం ది. తద్వారా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కుతుందని కంపెనీ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు.

 శ్రీరాం క్యాపిటల్‌తో భాగస్వామ్యం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. గత నాలుగు దశాబ్దాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారానే కంపెనీ వృద్ధి బాటలో సాగిందని శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్.త్యాగరాజన్ పేర్కొన్నారు. దీంతో తమ ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ భారీ వృద్ధిని అందుకుంటుందని తెలిపారు. గ్రూప్‌లోని శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూని యన్ ఫైనాన్స్ సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా శ్రీరాం క్యాపిటల్ వ్యవహరిస్తోంది. గతేడాదిలో కూడా పిరమల్ శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌లో 9.9% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,636 కోట్లను చెల్లించింది. కాగా, ఈ నెల మొదట్లో వొడాఫోన్ ఇండియాలోగల 11% వాటాను యూకే మాతృ సంస్థ వొడాఫోన్‌కు రూ. 8,900 కోట్లకు విక్రయించింది.  

 బీఎస్‌ఈలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ షేరు 1% లాభంతో రూ. 602 వద్ద నిలవగా, శ్రీరాం సిటీ యూనియన్ 1% బలపడి రూ. 1,215 వద్ద, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ షేరు 3% ఎగసి రూ. 747 వద్ద ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement