‘పసిడి లావాదేవీలకు నూతన పరిమితి’  | New limit for reporting gold transactions soon | Sakshi
Sakshi News home page

‘పసిడి లావాదేవీలకు నూతన పరిమితి’ 

Oct 8 2017 7:34 PM | Updated on Aug 3 2018 3:04 PM

New limit for reporting gold transactions soon - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బంగారం ఇతర ఖరీదైన మెటల్స్‌లో లావాదేవీలపై పరిమితులకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నూతన ఉత్తర్వులను జారీ చేయనుంది. బులియన్‌లో బ్లాక్‌మనీ పేరుకుపోవడాన్ని నియంత్రించే నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అథియా వెల్లడించారు. రూ 50వేలకు మించిన బంగారం కొనుగోళ్లపై పాన్‌ కార్డు తప్పనిసరి కాదని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్న క్రమంలో నూతన నిబంధనలపై రెవెన్యూ శాఖ వివరణ ఇచ్చింది.

మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్తూ ఈ ఏడాది ఆగస్ట్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూల సెంటిమెంట్‌ను వ్యాపింపచేస్తుడటంతో వాటిని నిలిపివేసినట్టు హస్ముక్‌ అథియా చెప్పారు. అయితే జ్యూవెలర్లు బంగారు ఆభరణాల కొనుగోలు వివరాలను ఎంత విలువ దాటితే అధికారులకు వెల్లడించాలనే దానిపై లోతుగా చర్చించిన మీదట నూతన పరిమితిని ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement