ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం | ITC to sell entire stake in US-based subsidiary King Maker Marketing for $ 24 mn | Sakshi
Sakshi News home page

ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం

Oct 11 2016 12:08 AM | Updated on Sep 4 2017 4:54 PM

ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం

ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం

ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది.

పూర్తి వాటా విక్రయించిన ఐటీసీ
డీల్ విలువ రూ.160 కోట్లు

 న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది. ఈ వాటాను రూ.160 కోట్లకు విక్రయించనున్నామని ఐటీసీ కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నమోదైన కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ.. ఐటీసీ తయారు చేసిన సిగరెట్లను అమెరికాలో పంపిణి చేస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీలో పూర్తి వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను తమ కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని ఐటీసీ వివరించింది.

దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ నెల 8న జరిగిందని, ఈ విక్రయానికి అమెరికాలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. ఏస్, చక్కర్స్, హై-వాల్, గోల్డ్ క్రెస్ట్‌బ్రాండ్లను కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ పంపిణి చేస్తోంది. ఈ విక్రయం పూర్తయిన తర్వాత కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ తమ అనుబంధ కంపెనీగా కొనసాగదని ఐటీసీ స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐటీసీ షేర్ అర శాతం లాభపడి రూ.240 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement